'అమ్మ' క్యాంటీన్లను ఆధునికీకరించాలని సీఎం విజయ్ ఆదేశాలు
- క్యాంటీన్ల మౌలిక సదుపాయాలను, ఆహార పదార్థాల నాణ్యతను పెంచాలని ఆదేశం
- ఆహార నాణ్యత, రుచి ఆశించిన స్థాయిలో ఉండటం లేదని తన దృష్టికి వచ్చినట్లు వెల్లడి
- ప్రజలకు రుచికరమైన భోజనం అందేలా చూడాలన్న విజయ్
అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన 'అమ్మ క్యాంటీన్ల'ను రాష్ట్రవ్యాప్తంగా ఆధునికీకరించాలని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సోమవారం ఆదేశించారు. క్యాంటీన్ల మౌలిక సదుపాయాలను, ఆహార పదార్థాల నాణ్యతను పెంచాలని అధికారులను ఆదేశించారు. ఈ క్యాంటీన్లలో ఆహార నాణ్యత, రుచి ఆశించిన స్థాయిలో ఉండటం లేదని ముఖ్యమంత్రి దృష్టికి వచ్చింది.
దీంతో ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. క్యాంటీన్ల వద్ద సౌకర్యాలు, సదుపాయాలు మెరుగుపరచాలని ఆదేశించారు. కొత్త వంట పాత్రలు, సామాగ్రి అందించాలని అన్నారు. ప్రజలకు రుచికరమైన భోజనం అందేలా చూడాలని సూచించారు.
ఈ అమ్మ క్యాంటీన్లు జయలలిత హయాంలో ఏర్పాటయ్యాయి. మద్దతుదారులు, పార్టీ కార్యకర్తలచే ఆప్యాయంగా 'అమ్మ' అని పిలుచుకునే జయలలిత పుట్టినరోజున, 2013 ఫిబ్రవరి 24న ఈ క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. మొదట చెన్నైలో ప్రారంభమైన ఈ క్యాంటీన్లను అనంతరం పట్టణాలు, నగరాలకు విస్తరించారు. 2021లో డీఎంకే అధికారంలోకి వచ్చాక మరో 200 క్యాంటీన్లను ప్రారంభించింది. ఇప్పుడు విజయ్ అదే సంప్రదాయాన్ని కొనసాగించారు. గ్రేటర్ చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 383 అమ్మ క్యాంటీన్లు ఉండగా, స్థానిక సంస్థల పరిధిలో 237 క్యాంటీన్ల ద్వారా పేదలకు తక్కువ ధరకు భోజనం అందిస్తున్నారు. రూపాయికే ఇడ్లీ, రూ.3కు పొంగలి, రూ.5కి భోజనం అందిస్తున్నారు.